విజయవాడ: జిల్లాలో 'ఫ్రైడే-డ్రైడే' కార్యక్రమాలు.. కలెక్టర్

ఎన్టీఆర్ జిల్లాలో సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు వంటివి ప్రబలకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ లక్ష్మీశ ఓ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఫ్రైడే-డ్రైడే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అధికారుల మధ్య పటిష్ట సమన్వయం, సమాచార మార్పిడికి విజయవాడలోని కలెక్టరేట్లో ఫోన్ నెంబర్91549 70454తో కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్