విజయవాడ: దుర్గమ్మ సన్నిధిలో గిరి ప్రదక్షిణ రద్దు

చంద్రగ్రహణం కారణంగా, మార్చి 3న విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ ఆలయాన్ని ఉదయం 10 గంటల నుంచి మూసివేయనున్నారు. దీనితో గిరి ప్రదక్షిణ, ఆర్జిత సేవలు, పంచ హారతులు రద్దు చేయబడ్డాయి. ఆలయ తలుపులు మార్చి 4న (బుధవారం) తెల్లవారుజామున 3 గంటలకు తిరిగి తెరుచుకుంటాయి. సంప్రోక్షణ అనంతరం, ఉదయం 8 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం అందుబాటులో ఉంటుంది. ఉదయం 8.30 గంటలకు ఆర్జిత సేవలు ప్రారంభమవుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్