లిక్కర్ స్కాం కేసులో ఇవాళ విచారణకు హాజరుకాలేనని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్‌కు తెలిపారు. తన బిజీ షెడ్యూల్ వల్ల విచారణకు రావలేకపోతున్నట్లు చెప్పారు. మరో రెండు రోజుల్లో విచారణకు హాజరయ్యే తేదీని తెలియజేస్తానని పేర్కొన్నారు. కాగా, ఏప్రిల్ 18న మొదటిసారి సిట్ విచారణకు హాజరైన విజయసాయి, పలు సూత్రధారులు, పాత్రధారుల వివరాలు వెల్లడించారు.