జగన్ పరామర్శ యాత్రల పేరుతో ప్రజలు, పోలీసులపై దొమ్మీలు చేస్తున్నారని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ శుక్రవారం విమర్శించారు. ముందుగా తన హయాంలో కల్తీ మద్యం వల్ల చనిపోయిన కుటుంబాలను పరామర్శించాలని సూచించారు. మద్యం, ఇసుక విషయంలో వైసీపీ హయాంలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. అవసరమైతే ఆధారాలు సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.