విజయవాడలోని పిబి సిద్ధార్థ కళాశాలలో ఈ నెల 18న జాబ్ మేళాను ఏపీఎస్‌ఎస్‌డీసీ నిర్వహించనుంది. ఈ మేళా ద్వారా 14 ప్రముఖ కంపెనీల్లో మొత్తం 660 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ పూర్తిచేసిన వారు అర్హులు. ఎంపికైనవారికి నెలకు రూ.15,000 నుంచి రూ.30,000 వరకు వేతనం లభించనుంది.