విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద శుక్రవారం కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు రావడంతో ఇవాళ 2,18,771 క్యూసెక్కుల వరద నీరు చేరింది. బ్యారేజీ వద్ద నీటిమట్టం 12 అడుగులకు చేరుకుంది. 5 అడుగుల మేర 30 గేట్లు, 4 అడుగుల మేర 40 గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.