విజయవాడలో మద్యానికి బానిసైన అంజయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, అంజయ్య ఇటీవల భార్య పుట్టింటికి వెళ్లడంతో మరింతగా మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 26న ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోయిన అంజయ్య, శనివారం పల్స్ బార్ సమీపంలో విగతజీవిగా కన్పించాడు. గుణదల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.