విజయవాడ: అర్ధరాత్రి ముమ్మర తనిఖీలు.. పట్టుబడ్డ ‘మందు’ బాబులు

విజయవాడలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బుధవారం అర్ధరాత్రి పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. డీసీపీ కృష్ణకాంత్ పటేల్ పర్యవేక్షణలో బందర్ రోడ్, లబ్బీపేట, బెంజ్ సర్కిల్ వంటి ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరిగాయి. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేసి, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నగరంలో వేడుకలు ప్రశాంతంగా ముగిశాయని డీసీపీ తెలిపారు.

సంబంధిత పోస్ట్