విజయవాడ: లిక్కర్‌ కేసులో విజయసాయికి మరోసారి నోటీసులు

మద్యం కుంభకోణంలో నిందితుడైన (ఏ-5) వైసీపీ మాజీ నేత వి.విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. శనివారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని సిట్ కార్యాలయానికి హాజరుకావాలని పేర్కొంది. గతంలో ఆయన ఏప్రిల్ 18న విచారణకు హాజరై కీలక సమాచారం ఇచ్చారు. ఈసారి ఆయన ఏ గుట్టు విప్పుతారన్నది ఆసక్తికరంగా మారింది. కొన్ని సమావేశాలు ఆయన నివాసంలోనూ జరిగినట్టు సిట్ తేల్చింది.

సంబంధిత పోస్ట్