విజయవాడ పాయకాపురంలోని ఓ సినిమా థియేటర్ వద్ద ఆటోలను దొంగిలించిన ఇద్దరు పాత నేరస్తులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రాజేష్, దాసరి తిరుపాళ్లు అనే నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. చోరీ జరిగిన కొద్ది సమయంలోనే నిందితులను పట్టుకున్న పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.