పులిచింతల నుంచి వచ్చిన 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు ఇవాళ ప్రకాశం బ్యారేజీకి చేరనున్నట్టు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని, 24 గంటల పర్యవేక్షణ కోసం కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రస్తుతం 55 గేట్లు ఒక అడుగు, 15 గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి మొత్తం 74 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.