విజయవాడ అమ్మవారిని దర్శించుకుంటే అంతా శుభమే కలుగుతుందని ప్రముఖ ప్రవచనకర్త, రాష్ట్ర నైతికత విలువల ప్రభుత్వ సలహాదారులు చాగంటి కోటేశ్వరరావు అన్నారు. సోమవారం ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో వేద పండితులు ఘన స్వాగతం పలికారు. ఆలయ ఈవో సేన నాయక్ దగ్గరుండి అమ్మవారి దర్శనం కల్పించి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలు అందజేశారు.