విజయవాడ: లాడ్జిలలో వ్యభిచారం

విజయవాడలోని గవర్నర్ పేటలో గురువారం సాయంత్రం పోలీసులు ఒక లాడ్జిపై దాడి చేశారు. స్థానికుల సమాచారం మేరకు వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయగా, నలుగురు మహిళలను వ్యభిచార కూపం నుంచి పోలీసులు విడిపించారు. సీఐ నాగమురళి తెలిపిన వివరాల ప్రకారం, కోర్టు ఉత్తర్వుల మేరకు విడిపించిన మహిళలను సంరక్షణ కేంద్రానికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్