విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 2018 జూన్ 23న జరిగిన అత్యాచారం కేసులో న్యాయమూర్తి జి.రాజేశ్వరీ గురువారం తీర్పు చెప్పారు. న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన 21ఏళ్ల యువతిపై ఆమె బంధువు అత్తిలి కనకరాజు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నేరం రుజువవడంతో అతనికి 7ఏళ్లు జైలు, రూ.2వేలు జరిమానా విధించారు. కేసు వాదనలో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.రాధా పాల్గొన్నారు.