వైసీపీ కుట్రలు, దుర్మార్గాలకు ప్రజలు బుద్ధి చెప్పారు. గొల్లపూడిలోని టీడీపీ కార్యాలయంలో దేవినేని ఉమా శనివారం మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డి అంతరంగంలో ఉన్న మాటలే ప్రసన్న కుమార్ రెడ్డి, పేర్ని నాని మాట్లాడుతున్నారని అన్నారు. పేర్ని నాని అభ్యంతరకర వ్యాఖ్యలపై యంత్రాంగం సుమోటోగా కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు.