గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని సీబీఐ, సిట్ విచారణతో వెలుగులోకి వస్తున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. గురువారం గొల్లపూడిలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, తిరుమల నెయ్యి కల్తీతో భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వారు త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు తన అనుభవంతో రాష్ట్రంలోని వ్యవస్థలను మళ్లీ గాడిలో పెడుతున్నారని కొనియాడారు.