విజయవాడ నగరంలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం అర్ధరాత్రి నిర్మలా జంక్షన్ వద్ద పటమట సీఐ పవన్ కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాహన తనిఖీలలో, మద్యం మత్తులో మూడు వాహనాలను నడుపుతున్న వారిని గుర్తించి, వాహనాలను సీజ్ చేశారు. అర్ధరాత్రి బ్రెత్ అనలైజర్ పరీక్షల ద్వారా వీరిని పట్టుకున్నారు.