విజయవాడ: వైసిపి శ్రేణుల జిల్లా సమన్వయకర్తల సమావేశం..

విజయవాడలో మంగళవారం వైసీపీ నాయకులు జిల్లా సమన్వయకర్తల సమావేశం నిర్వహించారు. మాజీ సీఎం జగన్ ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రతి నియోజకవర్గం నుండి 60వేల సంతకాలు సేకరించాలని జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ సూచించారు. జిల్లాలో ఇసుక మాఫియా, రైతుల సమస్యలు, రేషన్ బియ్యం సమస్యలపై చర్చించి, పార్టీ తరపున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగరవేసేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్