రాష్ట్రంలో డీఎస్సీ-2025 పరీక్షలో జరిగిన అక్రమాలపై పోరాడుతున్న అభ్యర్థులకు అండగా నిలిచేందుకు వైసీపీ ఒక ప్రత్యేక పోరాట కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కల్పలతారెడ్డితో పాటు మరో ఇద్దరు సభ్యులుగా ఉంటారు. మరోవైపు, అమరావతి రైతులకు ఇచ్చిన హామీ మేరకు, పేర్ని నాని, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, అరుణ్ కుమార్లతో కూడిన 'సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ'ని, ప్రత్యేక లీగల్ సెల్స్ను కూడా వైసీపీ ఏర్పాటు చేసింది.