విజయవాడ గ్రామీణ మండలం గొల్లపూడికి చెందిన సూరపనేని గిరిధర్ వంశీకృష్ణ (36) అమెరికాలో గుండెపోటుతో మృతి చెందారు. పదేళ్ల క్రితం చదువుకోవడానికి వెళ్లి అక్కడే స్థిరపడిన వంశీకృష్ణ, హోటల్ నిర్వహణతో పాటు ఉద్యోగం చేస్తున్నారు. గురువారం రాత్రి తల్లిదండ్రులకు ఈ విషయం తెలియడంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కుమారుడి భౌతికకాయాన్ని స్వదేశానికి తరలించడానికి పది రోజులకు పైగా సమయం పట్టే అవకాశం ఉండటంతో, అమెరికాలోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు తల్లిదండ్రులు గొల్లపూడి నుంచి బయలుదేరి వెళ్లారు. వంశీకృష్ణ మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.