చిన్నారిని గోడకేసి కొట్టి చంపిన తల్లి ప్రియుడు

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందన్న కారణంతో విజయవాడలో ఓ యువకుడు 18 నెలల పసిపాపను గోడకేసి కొట్టి చంపినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికంగా ప్రేమ వివాహం చేసుకున్న దంపతులకు ఐదేళ్ల బాబు, 18 నెలల పాప ఉన్నారు. భర్త స్నేహితుడు కనిజం వంశీతో భార్య వివాహేతర సంబంధం పెట్టుకొని తల్లి గారి ఇంటికి వెళ్తునని చెప్పి తరచుగా వెళ్తూ ఓ ఇల్లు అద్దెకు తీసుకోని అతడితో కలిసి సహజీవనం చేస్తోంది. ఇటీవల వీరి మధ్య మనస్పర్థలు రావడంతో, క్షణికావేశంలో వంశీ చిన్నారిని గోడకేసి కొట్టడంతో మృతి చెందింది. కుటుంబీకులకు ఫోన్ చేసి చిన్నారి చనిపోయిందని పొంతన లేని సమాదానాలు చెప్పడంతో పోలీసులకు అప్పగించారు. నిందితుడు గతంలో పోక్సో కేసులో జైలుకు వెళ్లినట్లు అలాగే అతనిపై కేసులు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్