కల్తీ మద్యం చావులకు చంద్రబాబే కారణమని, డిస్టిలరీల నిర్వాహకులంతా టిడిపి వారేనని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. శనివారం వైసిపి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మద్యం తయారీకి యధేచ్చగా స్పిరిట్ వాడుతున్నారని, కల్తీ మద్యాన్ని బ్రాండెడ్ మద్యంగా విక్రయిస్తున్నారని తెలిపారు. ప్రతి మూడు బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యమని వివరించారు. టిడిపి ధన దాహానికి అమాయకులు బలవుతున్నారని నాగార్జున వివరించారు.