అమరావతి: జగన్, పేర్నినానికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పేర్నినానిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ మహిళను అడ్డం పెట్టుకుని ఆ ప్రాంతంలో కుట్రకు పేర్నినాని పాల్పడుతున్నారని మండిపడ్డారు.  ఆదివారం అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పల హరిక కారును వదిలేశామని తెలిపారు. కానీ తర్వాత ఆమె కావాలని వెనక్కి వచ్చి పోలీసులపై, తెలుగుదేశం నాయకుల గురించి అభ్యంతరకరంగా మాట్లాడారని స్థానికులే చెబుతున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్