అమరావతి రాజధాని నిర్మాణం పేరిట రైతుల నుంచి బలవంతంగా భూ సమీకరణ చేస్తే చూస్తూ ఊరుకోమని బిసివై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణానికి తమ పార్టీ వ్యతిరేకం కాదని, కేవలం బలవంతపు భూ సమీకరణకు మాత్రమే తాము వ్యతిరేకమన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అమరావతిలో ఇప్పటికే జరుగుతున్న భూ కుంభకోణాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయని, వాటిపై త్వరలోనే నిజాలు బయట పెడతామన్నారు.