గుడివాడలో జడ్పీ చైర్‌పర్సన్ హారికపై జరిగిన దాడిని ఖండిస్తూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు నేతృత్వంలో ఆదివారం వైసీపీ నేతలు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందన్నారు. బీసీ మహిళపై దాడి జరగడం దారుణమని అన్నారు. కూటమి ప్రభుత్వం బిసి మహిళలకు క్షమాపణ చెప్పాలని తెలిపారు. దాడిలో పాల్గొన్న వారిపై హత్యాయత్నం కేసులు పెట్టాలన్నారు.