AP: తన సొంత నియోజకవర్గం కుప్పంలో సోమవారం CM చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. 'నారావారిపల్లె జన్మనిస్తే.. కుప్పం రాజకీయ జన్మనిచ్చింది. నా మనసుకు దగ్గరగా కుప్పం ప్రజలే ఉంటారు. కుప్పం ప్రజలు 40 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఎన్నుకుంటున్నారు. ఏ పని చేయాలన్నా కుప్పంలోనే ప్రారంభిస్తాను’ అని అన్నారు.