నైటింగేల్ అవార్డు అందుకున్న కర్నూలు ఏఎన్ఎం

AP: కర్నూలు రీజినల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ట్రైనింగ్ సెంటర్‌లో ఏఎన్ఎంగా సేవలందిస్తున్న వలివేటి శుభావతి నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు. అలాగే రూ.లక్ష నగదు అందుకున్నారు. 29 ఏళ్ల పాటు ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసిన అనంతరం ఆమె వైద్య విద్య శిక్షణ అధికారి రూపంలో ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

సంబంధిత పోస్ట్