జ‌గ‌న్‌ను క‌లిసిన క‌ర్నూలు జీజీహెచ్ పారిశుద్ధ్య‌ కార్మికులు

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ ను కర్నూలు జీజీహెచ్ పారిశుద్ధ్య కార్మికులు కలిశారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తమను తొలగించారని, ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నా కొత్త కాంట్రాక్టర్ రాగానే తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నపళంగా తొలగించడంతో రోడ్డున పడ్డామని వారు జగన్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు అండగా ఉంటానని, అవసరమైన న్యాయ పోరాటం చేద్దామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పార్టీ అండగా ఉంటుందని జగన్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్