ఆదోని: సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు ప్రారంభం వాయిదా

ఆదోని నియోజకవర్గంలో 2025-26 సంవత్సరానికి సంబంధించిన పత్తి కొనుగోళ్లు త్వరలో సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ద్వారా ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి తెలిపారు. శనివారం ఆదోనిలో సీసీఐ కమర్షియల్ ఆఫీసర్ శ్రీనివాస్, మార్కెట్ యార్డు సెక్రటరీ గోవిందు, వైస్ చైర్మన్ ఆదూరి విజయకృష్ణతో సమావేశమైన ఆయన, రైతులు మద్దతు ధరలో పత్తి విక్రయించడానికి అవసరమైన ఏర్పాట్లను చర్చించారు. సాంకేతిక సమస్యల కారణంగా పత్తి కొనుగోళ్ల ప్రారంభోత్సవం ఈ నెల 27వ తేదీకి వాయిదా పడిందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్