ఆదోని మండల పరిధిలోని పెద్దహరివాణంలో వెలసిన శ్రీదేవరహల్ అయ్యమ్మవ్వ జాతర మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామునే పిండి వంటకాలతో భక్తులు నైవేద్యం సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఎద్దుల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు. రాత్రి ప్రదర్శించిన కన్నడ సామాజిక నాటకం ఆకట్టుకుంది. గ్రామస్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.