ఆదోని రూరల్ మండలంలోని పెద్దతుంబళం గ్రామంలో కర్ణాటక మద్యం అక్రమంగా విక్రయిస్తున్న నక్కల సునీల్ ను శుక్రవారం ఎక్సైజ్ సీఐ సైదుల్ అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 120 మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని, మద్యం సరఫరాదారుడైన నక్కల సురేష్ పై కేసు నమోదు చేశారు. ఇద్దరిని రిమాండ్‌కు పంపించినట్లు, విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు. అక్రమ మద్యం, రవాణాపై నిరంతరం నిఘా కొనసాగుతోందని అన్నారు.