ఆదోని మండలం సంతేకూడ్లూర్ గ్రామంలో ఆదివారం కెవిపిఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కెవిపిఎస్ నాయకులు ఆటో ఈరన్న జెండాను ఆవిష్కరించారు. దళితుల హక్కులు, సంక్షేమం కోసం కెవిపిఎస్ అనేక పోరాటాలు నిర్వహించి విజయాలు సాధించిందని నాయకులు తెలిపారు. కుల, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా సమానత్వం, సామాజిక న్యాయం కోసం పోరాటాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు జీవరత్నం, భీమేష్, రాధాకృష్ణ, ఏలియా, వీరేష్, ప్రసాద్, కోసిగిఈరన్న, పెద్ద రంగప్ప తదితరులు పాల్గొన్నారు.