కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణాన్ని రెండో ముంబైగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ను కోరారు. సోమవారం ఆయన మాట్లాడుతూ, బసాపురం ఎస్ఎస్ ట్యాంకు మరమ్మతులకు రూ. 45 కోట్లు, రోడ్ల విస్తరణకు రూ. 52 కోట్లు, గ్రామీణ రోడ్లకు రూ. 42 కోట్లు, మార్కెట్ కమిటీ లింకు రోడ్లకు రూ. 6 కోట్లు కేటాయించాలని వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. మంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన పేర్కొన్నారు.