మోడీ కర్నూలు పర్యటన విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే పార్థసారథి

ఈనెల 16న కర్నూలు జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను విజయవంతం చేయాలని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి పిలుపునిచ్చారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో సాధించిన అభివృద్ధి విజయాలను ప్రజలు తెలుసుకోవాలని ఆయన సూచించారు. మోడీ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించాలని కోరారు. పర్యటన విజయవంతం కోసం గ్రామస్థాయి నుండి పట్టణ, జిల్లా స్థాయి వరకు విస్తృత ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్