ఆదోని మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు: రైతుల ఆవేదన

ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు నమోదయ్యాయి. పత్తి క్వింటా కనిష్ఠ ధర రూ.4,005, గరిష్ఠ ధర రూ.7,621 పలికింది. వేరుశనగ కనిష్ఠ ధర రూ.4,016, గరిష్ఠ ధర రూ.5,782 వరకు, ఆముదాలు కనిష్ఠ ధర రూ.5,188, గరిష్ఠ ధర రూ.5,923 వరకు అమ్ముడయ్యాయి. సీసీఐ పత్తి కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, పత్తి ధర రూ.8 వేలు దాటలేదని వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్