ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలం దిబ్బనుగుర్తి గ్రామానికి చెందిన 42 ఏళ్ల రైతు రాముడు, కడుపునొప్పి భరించలేక మూడు రోజుల క్రితం పురుగుమందు తాగి ఆదివారం చికిత్స పొందుతూ మృతిచెందాడు. అపస్మారక స్థితికి చేరుకున్న ఆయనను కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మరణించినట్లు సీఐ వేణుగోపాల్ తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.