కొత్తకోట: పెట్రోల్ పోసుకుని మహిళ ఆత్మహత్య

కర్నూలు రూరల్ మండలం సుంకేసుల కొత్తకోట బీసీ కాలనీకి చెందిన వడ్డె ఎల్లమ్మ (37) ఆదివారం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. పందిపాడు గ్రామ సమీపంలోని ఖాళీ స్థలంలో ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, భర్త కొన్నేళ్ల క్రితమే విడిచిపెట్టడంతో ఆమె ఒంటరిగా జీవిస్తున్నట్లు తెలిసింది. ఘటనకు గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్