నూతన కలెక్టర్ పి రంజిత్ భాష ని కలిసిన చింతా సురేష్ బాబు

కర్నూలు జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ పి రంజిత్ భాషా ని శనివారం కలెక్టర్ కార్యాలయంలోని జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లా నందికొట్కూరు వాసి అయిన కలెక్టర్ కర్నూలు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించడం శుభ పరిణామమని అన్నారు.

సంబంధిత పోస్ట్