25న కర్నూలులో గట్కా, తైక్వాండో, ఉషు జిల్లా జట్ల ఎంపిక

కర్నూలు నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో ఈనెల 25వ తేదీన గట్కా, తైక్వాండో, ఉషు క్రీడలలో అండర్ 14, అండర్ 17 బాల బాలికల ఉమ్మడి కర్నూలు జిల్లా జట్లను ఎంపిక చేయనున్నట్లు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శులు బాటా లక్ష్మయ్య, జే అరుణ కుమారి, నంద్యాల ఎస్జీఎఫ్ కార్యదర్శులు సుధాకర్, శశికళలు బుధవారం తెలిపారు. ఆసక్తిగల ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని వ్యాయామ ఉపాధ్యాయులు తమ క్రీడాకారులను సొంత ప్లేట్లతో పోటీలలో పాల్గొనేలా చూడాలని కోరారు. క్రీడాకారులకు భోజన వసతి కల్పించబడుతుంది.

సంబంధిత పోస్ట్

✕
✕