జాతీయ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌కు రిడ్జ్ విద్యార్థి ఎంపిక

లక్ష్మీపురంలోని రిడ్జ్ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి బి. మోక్షిత్, 51వ సబ్ జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ పోటీలు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు విజయవాడలో జరగనున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల సీఈఓ జి. గోపీనాథ్ మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి విద్యతో పాటు క్రీడలు కూడా కీలకమని, ఇవి విద్యార్థుల్లో పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. జాతీయ స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని విద్యార్థిని ప్రోత్సహించారు. ఈ ఎంపిక విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి క్రీడల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.

సంబంధిత పోస్ట్

✕
✕