అవ్వాతాతలకు అండగా నిలిచిన సీఎం చంద్రబాబు

అవ్వాతాతలకు పెద్ద కొడుకుగా సీఎం చంద్రబాబు అండగా నిలిచారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి మొట్రు రామాంజనేయులు అన్నారు. బుధవారం పెద్దకడబూరు గ్రామంలోని బీసీ కాలనీలో మొట్రు రామాంజనేయులు అవ్వాతాతలకు సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ప్రతి నెల ఒకటో తారీఖునే క్రమం తప్పకుండా ఇంటి వద్దకే పింఛన్లు అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందన్నారు.

సంబంధిత పోస్ట్