పెద్దకడబూరు మండలంలోని వివిధ గ్రామాలలో ఉగాది వేడుకలలో భాగంగా బుధవారం యువత రంగులాటతో సందడి చేసింది. మండల పరిధిలోని కల్లుకుంట, చిన్నతుంళం, హెచ్ మురవణి బసలదొడ్డి, కంబళదిన్నె, పెద్దకడబూరు గ్రామాలలో యువకులు సాంప్రదాయ బద్దంగా రంగులు చల్లుకున్నారు. గ్రామాల్లో ఉగాది మరుసటి రోజు యువత రంగులాట ఆడడం ఆనవాయితీగా వస్తోంది.