పెద్దకడబూరు మండలంలోని చిన్నతుంబళం గ్రామంలో బుధవారం టీడీపీ సీనియర్ నాయకులు వీరేష్ గౌడ్ సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ప్రతి నెల ఒకటో తారీఖునే క్రమం తప్పకుండా ఇంటి వద్దకే పింఛన్లు అందజేసి ముఖ్యమంత్రి చంద్రబాబు అండగా నిలుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమం దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఏపీలో మాత్రమే జరుగుతుందన్నారు.