ఎస్సీ కాలనీలో రహదారి సమస్యకు తక్షణ పరిష్కారం

పెద్దకడబూరులోని ఎస్సీ కాలనీలో ప్రధాన రహదారిపై వర్షపు నీరు అధికంగా నిల్వ ఉండటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన అధికారులు సొంత నిధులతో డస్ట్ కంకర వేయించి, జేసీబీ సహాయంతో రహదారిని లెవెల్ చేయించారు. దీంతో రాకపోకలు సులభతరమై ప్రజలకు ఉపశమనం కలిగింది. ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్ మీ సేవ ఆంజనేయులు, ఈఓఆర్డీ జయరాముడు, పంచాయతీ కార్యదర్శి మంజునాథ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్