మంత్రాలయం మండలంలోని బసాపురం గ్రామంలో గురువారం నాడు ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి నూతనంగా నిర్మించిన ఫిల్టర్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ఈ ప్లాంట్ ముఖ్య ఉద్దేశ్యమని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తెలిపారు. ఈ ప్లాంట్ ద్వారా బసాపురం గ్రామ ప్రజలు స్వచ్ఛమైన నీటిని పొందనున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు భీమా రెడ్డి, కోసిగి ఇన్‌చార్జ్ మురళి రెడ్డి, మాజీ సర్పంచ్ రాఘవ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.