సమస్యలు పరిష్కరించడంలో మండల తహసీల్దార్ పూర్తిగా విఫలమయ్యారని సీపీఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ విమర్శించారు. బుధవారం పెద్దకడబూరులోని మండల తహసీల్దార్ ఆఫీసు వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కల్లుకుంట గ్రామ ఏడబ్ల్యూ ల్యాండ్ భూ సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారని, 174/1 సర్వే నెంబర్ విషయంపై పలుమార్లు విన్నవించినా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.