నన్నూరులో వైభవంగా మద్దిలేటిస్వామి కళ్యాణోత్సవం

ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలో వెలసిన చింతలముని నల్లారెడ్డి స్వామి, మద్దిలేటి స్వామి ఆలయంలో శనివారం శ్రీలక్ష్మీ సమేత మద్దిలేటి స్వామి వార్ల కళ్యాణోత్సవం పురోహితుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు సమక్షంలో నృసింహ జయంతి సందర్భంగా ఆలయంలో గణపతి పూజ, పుణ్యాహవాచనము, అభిషేకం. గణపతి హోమం, సుదర్శన హోమం నిర్వహించారు. గ్రామంలో స్వామి అమ్మవార్లను పల్లకిలో ఊరేగించారు.

సంబంధిత పోస్ట్