శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామికి బంగారు హారం సమర్పణ

నంద్యాల జిల్లా లోని శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల పుణ్య క్షేత్రంలో హైదరాబాదుకు చెందిన పి. సంతోష్‌కుమార్ 28 లక్ష్మీదేవి ప్రతిమలతో కూడిన బంగారు హారాన్ని శ్రీశైలం దేవస్థాన కార్యాలయంలో కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావుకు అందజేశారు. ఈ సందర్బంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ బంగారు హారం బరువు 19 గ్రాములు ఉందని తెలిపారు. ఈ బంగారు హారంకు సంబందించి దాతకు దేవస్థానంకు సంబందించిన రశీదును అందజేసామని తెలిపారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలను ప్రసాదాలను అందజేశామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕