కర్నూలులోని ఓర్వకల్ ఎయిర్పోర్టులో ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ ఆధ్వర్యంలో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (FTO)ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు బీసీ. జనార్దన్ రెడ్డి, టీజీ. భరత్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజులు శనివారం ప్రారంభించారు. ఈ FTO ద్వారా ప్రైవేట్ పైలట్ లైసెన్స్, కమర్షియల్ పైలట్ లైసెన్స్ వంటి కోర్సులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టర్ డా. సిరి, పలువురు ఎమ్మెల్యేలు, ఓరియంట్ ఏవియేషన్ అకాడమీ చైర్మన్ ఆనంద్ జాకబ్ వర్గీస్ పాల్గొన్నారు.