ఎమ్మిగనూరు మండలం బోడబండ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం సందర్భంగా కార్యకర్తలు అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ నీలమ్మ మాట్లాడుతూ పౌష్టికాహారంతోనే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని, పోషకాహార లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలను నివారించడానికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పాలు, గుడ్లు, చిక్కీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు పోషకాహారంపై అవగాహన కల్పించారు. ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు తీసుకోవాలని తెలిపారు.